తెలంగాణను చలి వణికిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందన్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రతతో ప్రయాణికులు, ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారు నరకం చూస్తున్నారు.
ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి అధికమవుతోందని వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.
ఉదయం పూట పొగమంచు కురుస్తోందని, గాలిలో తేమ సాధారణం కంటే 25 శాతం అదనంగా పెరిగినట్టు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయని, ఫలితంగా చలి పెరుగుతోందని పేర్కొంది.