అక్షరాస్యతలో ముందుండే కేరళ ఇప్పుడు లింగవివక్షని జయించే విషయంలోనూ ఓ వినూత్నమైన ఆలోచన చేసింది. అబ్బాయిలకు కూడా ఇంటి పని…వంట పని వస్తే మంచిదని ఆ దిశగా వాళ్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
ఇందుకోసం ఆ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమశాఖ… ‘ది స్మార్ట్ కిచెన్’ కార్యక్రమం ద్వారా మగపిల్లలకీ, పెద్దవాళ్లకి కూడా వంటలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. బాగా చేసిన వారికి అవార్డులు కూడా ఇస్తుందట. ఆసక్తి ఉన్న మగవాళ్లకి వంటింటి సామగ్రి కొనుక్కొనేందుకు లోన్‌లు కూడా అందివ్వడం విశేషం.