టాలీవుడ్ యంగ్ హీరోకు తృటిలో పెను ప్రమాదం

టాలీవుడ్ యంగ్ హీరోకు తృటిలో పెను ప్రమాదం

0
79

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన యంగ్ హీరో రాజ్ తరుణ్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది…. తన కారులో ఈ రోజు తెల్లవారు జామున ప్రయాణిస్తున్న తరుణంలో ఔటర్ రింగ్ రోడ్ నర్సింగ్ సమీపంలోని అలీఖాపూర్ వద్ద తరుణ్ కు ప్రమాదం తప్పింది.

అయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో ఆయనకు ఎటువంటి గాయాలు తాకలేదు దింతో తరుణ్ వేరేకారులో వెళ్లి పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు..

తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు .. అయన ఇండస్ట్రీ కి రాక మునుపు అనేక లఘుచిత్రాలకు పనిచేశాడు. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తరువాత చాలా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం రాజ్ దిలీప్ రాజు ప్రొడక్షన్ లో ఇద్దరి లోకం ఒకటే సినిమాలో అయన నటిస్తున్నాడు… ఈ సినిమాకు విజయ్ కుమార్ కొండా దర్శకత్వం చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు…