తెలంగాణ ప్రభుత్వ అప్పు ఎంతో తెలుసా?

Do you know the debt of Telangana government?

0
111
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పద్దు పెరిగిపోతోంది. ద్రవ్య నియంత్రణ, నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితులకు లోబడే ప్రభుత్వం ప్రతి యేటా తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్‌ను మించిపోయాయి.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం దేశంలోని పలు రాష్ట్రాలు భారీగా అప్పులు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా భారీ మొత్తంలోనే అప్పులు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వ అప్పు నవంబర్ 30 నాటికి రూ. 2,37,747 కోట్లుకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ఇందులో స్వదేశీ అప్పు రూ. 2,34,912 కోట్లు, విదేశీ అప్పు రూ.2,835 కోట్లు అని తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత అయిదేళ్లలో విదేశీ ఆర్థిక సంస్థలు గానీ, రీ ఫైనాన్సింగ్ సంస్థలు గానీ తెలంగాణకు ఎలాంటి రుణాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇక వివిధ విదేశీ సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అసలు కింద రూ. 382.21 కోట్లు, వడ్డీ కింద రూ. 147.53 కోట్లు చెల్లించిందని తెలిపారు.