శ్రీవారి భక్తులకు శుభవార్త..ఆన్ లైన్ లో సర్వదర్శనం టికెట్లు..పూర్తి వివరాలివే..

Good news for Srivari devotees..Online Sarvadarshanam tickets..Full details ..

0
94

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల కోటా టికెట్లను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు సర్వదర్శన టోకెన్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

రోజుకు 20 వేల చొప్పున 6 లక్షల 20 వేల టికెట్లను విడుదల చేస్తామని పేర్కొన్నారు. 24న ఉదయం 9 గంటల నుంచి ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే జనవరి నెలకు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు 5 వేలు ఆఫ్‌లైన్‌లో.. మరో 5 వేలు ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.  25వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. రోజుకి 5 వేల చొప్పున లక్షా 55 వేల టికెట్లను విడుదల చేయనుంది. ఈ నెల 31వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు జారీ చేయనుంది. ఆఫ్‌లైన్‌లో ప్రతినిత్యం తిరుపతిలో ఐదు వేల టికెట్లు ఇవ్వనుంది.

తిరుమల వసతికి సంబంధించి ఈ నెల 27న ఉదయం 9 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు. కాగా జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో భక్తులు పొందవచ్చు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన, వసతిని బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. వీటితో పాటు డిసెంబర్ 23న ఉదయం 9 గంట‌ల‌కు జనవరి 1, 2, 13 నుండి 22 మరియు 26వ తేదీలలో 5500 వర్చువల్ సేవా దర్శన టికెట్లు విడుదల చేస్తారు.