తెలంగాణ: సికింద్రాబాద్ అల్వాల్ అంజనాపురి కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలల పిండాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై పడేశారు. వీధికుక్కలు కాలనీలో పిండాన్ని పట్టుకుని తిరుగుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు..వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ పిండాన్ని ఎవరు వదిలేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృత శిశువును గాంధీ ఆస్పత్రికి తరలించారు.