‘RRR’ నుంచి ఎన్టీఆర్ ‘కొమురం భీముడో’ సాంగ్ ప్రోమో రిలీజ్

NTR 'Komuram Bhimudo' song promo release from 'RRR'

0
89

రామ్​చరణ్, ఎన్టీఆర్​ నటించిన భారీ బడ్జెట్​ చిత్రం ‘ఆర్ఆర్​ఆర్​’. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు జక్కన్న. ఈ క్రమంలో తాజాగా ‘కొమురం భీముడో’ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు చిత్రయూనిట్.

కొమురం భీముడో.. కొమురం భీముడో అంటూ సాగే ఈ పాటను కాలభైరవ ఆలపించగా సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించారు. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి.’కొమురం భీముడో’ అంటూ సాగే ఈ పాట డిసెంబర్​ 24న విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=ZkWrbreledM&feature=emb_title

అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్​గా ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్ కీలకపాత్ర పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు.