తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు జరిమానా

0
111

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నాలుగేళ్లుగా కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై రూ. 10 వేలు జరిమానా కూడా విధించింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

సాగునీటి ప్రాజెక్టుల కోసం 2016లో జారీ చేసిన 123 జీవోను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నాలుగేళ్ల పాటు ప్రతి విచారణలోనూ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని లేదా వ్యక్తిగతంగా హాజరు కావాలని దేవాదాయ శాఖ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీఎస్ సోమేశ్ కుమార్‌ను గత నెలలో మరోసారి కోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం ఈరోజు విచారించింది.

కౌంటర్లు దాఖలు చేయకపోవడమే కాకుండా. కనీసం హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేయకపోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాని కోవిడ్‌కు రూ. 10,000 చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే ఏడాది జనవరి 24కి వాయిదా వేసింది.