Home మూవీస్ Flash- సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..ప్రముఖ డైరెక్టర్ మృతి

Flash- సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..ప్రముఖ డైరెక్టర్ మృతి

0
184

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. దక్షిణ భారత ప్రముఖ డైరెక్టర్ కెఎస్.సేతు మాధవన్ కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న సేతు మధావన్ చెన్నైలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. సేతు మాధవన్ వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. సేతు మాధవన్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

కఎస్ సేతు మాధవన్ 1961లో మలయాళంలో దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత తమిళ్, కన్నడ, హిందీ భాషలలో 60కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. ఇక తెలుగులో 1995లో వచ్చిన స్త్రీ సినిమాకు దర్శకత్వం వహించారు సేతు మాధవన్.

కేరళలోని పాలక్కడ్ లో 1931లో జన్మించిన సేతు మాధవన్ పూర్తి పేరు కే. సుబ్రహ్మణ్యం సేతు మాధవన్. ఆయనకు భార్య వల్సాల, పిల్లలు సోను కుమార్, ఉమ, సంతోష్ సేతు మాధవన్ ఉన్నారు. 1991లో మరుపక్కమ్ అనే తమిళ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. సేతు మాధవన్ మృతిపై తమిళ్, మలయాళ చిత్రపరిశ్రమలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశాయి.