Breaking News: ఏపీ​లో నాలుగుకు చేరిన ఒమిక్రాన్ కేసు నమోదు

Third Omicron case registered in AP

0
96

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింది నీరులా విస్తరిస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్​లో ఒమిక్రాన్ మూడో కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెంకు చెందిన మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్ వచ్చిన మహిళను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచినట్లు అదనపు డీఎంహెచ్‌వో వెల్లడించారు. విశాఖలోనూ ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. ఈ నెల 15న దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకింది. బాధితుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తిని హోమ్ ఐసొలేషన్‌లో ఉంచామని తెలిపారు.