బాబా భాస్కర్ నీ కంటతడి పెట్టించిన బిగ్ బాస్ షో

బాబా భాస్కర్ నీ కంటతడి పెట్టించిన బిగ్ బాస్ షో

0
72

అందరినీ నవ్విస్తూ.. నవ్వుతూ..సరదాగా కలిసి పోయె వ్యక్తి బాబా భాస్కర్. అయితే ఇప్పుడు బిగ్ బాస్ బాబాని టార్గెట్ చేశాడు. అందరితో కలివిడిగా ఉండడం బిగ్ బాస్ కి నచ్చని విషయం.. బిగ్ బాస్ ప్రత్యేకత అదే పది మంది ఒకే చోట చేరి ఒకరికొకరు కాళ్ళు పట్టి షో అదే వినోదంగా ప్రేక్ష కులకు ఆనందాన్ని ఇస్తుంది. బిగ్ బాస్ 3 ప్రారంభం నుంచి. ప్రేక్షకులను ఆకట్టుకునే వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బాబా భాస్కర్. మొదట ఆయన హౌస్ లోకి వెళ్ళినప్పుడు ప్రేక్షకులలో కొంత వ్యతిరేకత మొదలైనది. అయితే హౌసులో అడుగుపెడుతూనే జాఫర్ తో కలిసి ఆయన అందించిన వినోదంలో ఫిదా అయిపోయారు ప్రేక్షకులు.

బాబా భాస్కర్ ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సందర్భంలో 81 శాతం ఓట్లు ఆయనకి అనుకూలంగా వచ్చాయని వార్తలు. ఇంతవరకు ఏ సీజన్ లోనూ బిగ్ బాస్ లో ఇన్ని ఓట్లు వచ్చినవారు లేరనిచెప్పుకున్నారు. ఆయన ఇంటిలో ప్రవర్తించే విధానానికి ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అయ్యారు.