హైదరాబాద్ కు నయా సీపీ..బాధ్యతలు స్వీకరించిన సీవీ అనంద్

New CP to Hyderabad..CV Anand who took over the responsibilities

0
99

తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ పోస్టింగ్‌ ఇచ్చింది. మూడేళ్ల క్రితం భారీ సంఖ్యలో బదిలీలు జరిగిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఈ స్థాయిలో చేపట్టలేదు.

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న అంజనీకుమార్‌ ఏసీబీ డీజీగా బదిలీ చేస్తూ ఆయన స్థానంలో సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్బంగా హైదరాబాద్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీవీ ఆనంద్‌ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ కమిషనర్ గా రావడం సంతోషంగా ఉంది.. మెట్రోపాలిటన్ సిటీలో శాంతి భద్రతలు చాలా ముఖ్యం. ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉంటున్నారు.. సైబరాబాద్ సీపీగా కొనసాగినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతల మీద సమీక్ష పెట్టారు.

మహిళ భద్రత మీద ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది..డిసిపిగా 2001 నుండి సెంట్రల్ జోన్ గా పని చేశాను. అడిషనల్ సిపి ట్రాఫిక్ గా పని చేశాను. సైబర్ క్రైమ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. సైబర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తాము. డ్రగ్స్ పై ఇప్పటికే కొనసాగుతుంది. ఇంకా డ్రగ్స్ పై అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతాము. మహిళల భద్రత మీద ఎక్కువగా దృష్టి సారిస్తాం. గత నాలుగు సంవత్సరాల నుండి సెంట్రల్ డిప్యుటేషన్ లో వెళ్లి వచ్చాను. నూతన సంవత్సర వేడుకలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తానని తెలిపారు.