దేశంలో మానవ మృగాల ఆకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక ఘటన మరవకముందే మరో ఘటన వెలుగు చూస్తున్నాం. ఎన్ని కఠిన శిక్షలు వేసిన మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తర్ప్రదేశ్ ముజఫర్నగర్లో దారుణ ఘటన జరిగింది.
ఓ బాలిక ట్యూషన్ క్లాసులకు వెళ్లి తిరిగివస్తున్న క్రమంలో అక్కడే కాపు కాసిన ఇద్దరు దుండగులు ఆమెను అపహరించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరో ఇద్దరు వేచి ఉన్నారు. బాలికకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురిపై కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు స్థానిక జన్సాథ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ బబ్లూ సింగ్ వర్మ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.