టెక్ దిగ్గజమైన గూగుల్‌ను ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫార్మ్ టిక్‌టాక్ అధిగమించింది. ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌గా నిలిచిందని ఐటీ భద్రతా సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ వెలువరించిన నివేదికలో తెలిపింది.
వైరల్ వీడియో యాప్ టిక్‌టాక్ యూఎస్ ఆధారిత సెర్చ్ ఇంజిన్ గూగుల్ కంటే అధికంగా హిట్‌లను అందుకుందని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, జూన్లలో గూగుల్ అగ్రస్థానంలో ఉండగా ఆగస్ట్ నుంచి టిక్‌టాక్ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు ర్యాంకింగ్‌లు సూచిస్తున్నట్లు వెల్లడించారు.
2020లో గూగుల్ అగ్రస్థానంలో నిలవగా టిక్‌టాక్ సహా అమెజాన్, ఆపిల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఇతర సైట్‌లు టాప్ టెన్ జాబితాలో చోటుదక్కించుకున్నాయని నివేదికలో పేర్కొన్నారు. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, వినోదం కోసం టిక్‌టాక్‌ను ఎక్కువగా ఆస్వాదించడం టిక్‌టాక్‌కు జనాదరణ పెరగడానికి కారణమైందని తెలిపారు.