
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అమెరికా, రష్యా, సింగపూర్ దేశాల్లోనూ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. తాజాగా ఫ్రాన్స్‌లో కరోనా టెన్షన్ నెలకొంది. 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 1,04,611 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఫ్రాన్స్ శానిటరీ అథారిటీ వెల్లడించింది. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం.





