మందులు వాడకుండానే బీపీని కంట్రోల్ చేసుకోండిలా..!

Control BP without using drugs ..!

0
90

ప్రస్తుత జీవనశైలిలో చాలా మంది అధిక బీపీకి గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, కుటుంబ పరిస్థితులు. మరి దీనిని కంట్రోల్‌ చేయడానికి అధికంగా మందులు వాడుతున్నారు. అయితే ఈ మందులు బీపీని కంట్రోల్‌ చేయడమేమో కానీ వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటున్నాయి. కానీ మందులు వాడకుండా బీపీని కంట్రోల్ చేసుకోండి ఇలా..

ఎక్కువగా మందులు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. సహజసిద్దంగా కూడా బీపీని కంట్రోల్‌ చేయవచ్చు. హైపర్‌ టెన్షన్ తగ్గించాలంటే ఉపవాసం చేయడం బెస్ట్‌ ఎంపిక అని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల బీపీ దానంతట అదే కంట్రోల్ అవుతుందని సూచించారు. బీపీ మందులు మానేసి ఇలా చేస్తే మంచి ఉపశమనం దొరుకుతుందన్నారు. రక్తపోటును తగ్గించడానికి ఉపవాసంతో పాటు మద్యం, మాంసం, ఉప్పు తగ్గించాలి.

ఎక్కువ పండ్లు, కూరగాయలు తినాలి. పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారంపై ఆధారపడాలి. ఇలాచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఉపవాసం కూడా వైద్యుల పర్యవేక్షణలో జరగాలి. పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారాలు ఉప్పు తీసుకోవడం తగ్గిస్తే BP 18 పాయింట్లకు తగ్గించవచ్చు. మొక్కల ఆధారిత ఆహారం, తక్కువ మాంసాన్ని కలిపి తీసుకోవడం వల్ల రక్తపోటు 11 పాయింట్లు తగ్గుతుందని తెలిపారు. రోజూ మద్యపానం చేసేవారు ఆల్కహాల్‌ను మానేయ్యాలి.