ప్రజలకు అలర్ట్..సునామిలా పెరగనున్న కేసులు..WHO హెచ్చరిక

0
89

ఒమిక్రాన్ వేరియంట్​తో కరోనా కేసులు సునామీలా విరుచుకుపడతాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా ఉమ్మడి ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. కలిసి ఎదుర్కోకపోతే.. వైరస్ మరింత వ్యాపిస్తుందని అప్రమత్తం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా గత వారంతో పోలిస్తే..ఈ వారంలో కరోనా కేసులు 11శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. అమెరికాలో కొత్త కేసులు భారీగా నమోదయ్యాయని చెప్పింది. అక్టోబరు నుంచి ఈ పెరుగుదల నమోదవుతూ ఉందని పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న ఆధారాలను బట్టి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​తో ముప్పు అధికంగానే ఉందని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

మరోవైపు దేశంలో మూడో డోసుగా ఇతర వ్యాక్సిన్​ వినియోగంపై కేంద్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం.. ‘ముందు జాగ్రత్త డోసు’గా అంతకుముందు రెండు డోసులు ఏవి తీసుకున్నారో అదే మూడో డోసుగా తీసుకోవాలని పేర్కొంది.