అర్జున్ రెడ్డితో స్టార్ గా మారాడు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా..ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో పడింది చిత్ర బృందం.
అయితే తాజాగా లైగర్ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఇటీవల చెప్పినట్లుగానే ఈ సినిమా నుంచి బెస్ట్ స్టిల్స్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ స్టిల్స్ లో విజయ్ దేవరకొండ కెమెరా పట్టుకొని… అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అలాగే పూరి జగన్నాథ్ చెప్పే కథ వింటూ విజయ్ దేవరకొండ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా ఇవాళ ఉదయం పది గంటల సమయంలో లైగర్ సినిమా నుంచి ఫస్ట్ గేమ్స్ విడుదల చేయనుంది చిత్రబృందం.
https://twitter.com/PuriConnects?