ప్రముఖ తెలంగాణ కవి ఎమ్మెల్సీ, గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం లభించింది. గోరటి కలం నుండి జాలువారిన ‘వల్లంకి తాళం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సామాన్యుల జీవితాలనే సాహిత్యంగా సంధించిన వెంకన్న పాటలు తెలంగాణ తాత్విక చింతనకు ఆనవాల్లు. కాగా ఈ అవార్డు కింద లక్ష రూపాయల నగదుతో పాటు ప్రశంసపత్రం అందించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను దేశంలోని మొత్తం 20 భాషల్లోని రచనలకు ఈ అవార్డును ప్రకటించారు. వెంకన్న రాసిన అనేక పుస్తకాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. తెలంగాణ ఉద్యమానికి వెంకన్న సాహిత్యం పెద్ద బలం. వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడం మనందరికీ గర్వకారణం అని సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.