కొత్త సంవత్సరంలో అభిమానులకు దీప్తి సునయన షాకిచ్చింది. షణ్ముఖ్ తో 5 ఏళ్ల తమ ప్రేమ బంధాన్ని తెంచేసుకుంటూ సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్ట్ పెట్టింది. తాజాగా తమ బ్రేకప్‌పై తొలిసారిగా షణ్ముక్ స్పందించాడు.
‘ఆమెకు నిర్ణయం తీసుకునే హక్కుంది. తను ఇప్పటివరకు చాలా ఫేస్ చేసింది. ఇప్పటికైనా ఆమె సంతోషంగా, పీస్‌ఫుల్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా దారులు వేరైనా స్నేహితులుగా కలిసుంటాం. నేను బెటర్ పర్సన్ అయ్యేందుకు ఈ 5 సంవత్సరాలు నువ్వు అందించిన సహాయానికి ధన్యవాదాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్ దీపూ’.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం షణ్నూ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా ఈ బ్రేకప్‌కి ప్రధానంగా బిగ్‌బాస్ కారణమని తెలుస్తుంది. షణ్నూ సిరితో క్లోజ్‌గా ఉండటంవీరిద్దరు చేసిన అతి చాలా మందికి నచ్చలేదు. స్వయంగా సిరి వాళ్ల మథర్ హౌస్‌లోకి వచ్చి హగ్గులు నచ్చలేదని, తీరు మార్చుకోలేదని చెప్పినా వీరు మాత్రం తమకు నచ్చినట్లే ఉన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నుంచి యూత్‌కి సైతం వీరి ప్రవర్తన నచ్చలేదు. సిరి-షణ్నూల తీరుతో అటు దీప్తి సునయన, శ్రీహాన్ సైతం ట్రోలింగ్‌ని ఎదుర్కున్నారు.
ఇక ఈ ప్రేమ పక్షుల బ్రేకప్ ను జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. అంతా సిరి వల్లే జరిగిందంటూ.. తిట్టడం మొదలు పెట్టారు నెటిజన్లు. ఫ్యామిలీ ఎపిసోడ్ లో సిరి మదర్ వచ్చి.. మా అమ్మాయిని అలా హగ్ చేసుకోకు అని చెప్పినా.. వారిద్దరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. సగటు ప్రేక్షకుడికే ఇది నచ్చలేదంటూ.. ప్రేమించిన వ్యక్తి ఎలా తట్టుకుంటుందంటూ మరికొందరు దీప్తికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.