ప్రధాని మోడీ న్యూ ఇయర్​ కానుక..రైతుల ఖాతాల్లోకి రూ.20,900 కోట్లు

Prime Minister Modi's New Year gift of Rs 20,900 crore into farmers' accounts

0
69

రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద అందించే  ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి 10వ విడత నిధులను వర్చువల్​గా విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పథకంలోని పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 10.09 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20,900 కోట్లు జమ అయ్యాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ..ఎగుమతుల్లో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. అందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. “ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 8శాతానికిపైగా ఉంది. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు భారత్​కు వస్తున్నాయి. జీఎస్​టీ రాబడిలో గత రికార్డులు బద్దలవుతున్నాయి. ఎగుమతుల్లో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. 2021లో కేవలం యూపీఐ ద్వారానే రూ.70 కోట్ల లావాదేవీలు జరిగాయి.

ఇప్పుడు 50 వేలకు పైగా అంకుర సంస్థలు పని చేస్తున్నాయి. అందులో గత 6 నెలల్లోనే 10 వేల అంకురాలు నమోదయ్యాయి. పర్యావరణ మార్పులపై ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నాం. 2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తొలగించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అలాగే.. విద్యుత్తు వాహనాల కోసం కృషి చేస్తున్నాం. 2021లో అమ్మాయిల వివాహ వయసును 18 నుంచి 21కి పెంచాం. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పీఎం గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక ఒక రూపును తీసుకురానుంది. మేక్​ ఇన్​ ఇండియాకు కొత్త మార్గాలు చూపుతూ.. చిప్, సెమీకండక్టర్ల తయారీ కోసం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చాం అని ప్రధాని తెలిపారు.