తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం..పెళ్లైన వారానికే ఎస్సై దుర్మరణం

Serious tragedy in the Telangana police department .. Essay murder within the wedding week

0
83

తెలంగాణలోఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢికొన్న ఘటనలో వికారాబాద్ ఎస్ఐ సహా ఆయన తండ్రి మృతి చెందాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ వద్ద జరిగింది.

కాగా.. ఎస్ఐ శ్రీను నాయక్ వారం రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. ఎస్సై శ్రీను నాయక్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండా. హైదరాబాద్ నుంచి దేవరకొండకు వెళుతున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.