పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిన నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ విడుదలపైనా అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే భీమ్లానాయక్, బంగార్రాజు సంక్రాంతి బరిలో నిలిచినసంగతి తెలిసిందే.
అయితే నూతన సంవత్సరం కానుకగా విడుదల చేసిన పోస్టర్లోనూ విడుదల తేదీ జనవరి 14 అనే ఉంది. దీంతో ఫ్యాన్స్‌లో కొంత ఉపశమనం కలిగినా..మరికొందరిలో అనుమానం అలాగే ఉంది. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చారు దర్శకుడు రాధాకృష్ణ.
జనవరి 2న ఓ అభిమాని పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు రాధాకృష్ణ. దానికి మరో ఫ్యాన్ రిప్లై ఇస్తూ.. “సినిమాను ప్రీ పోన్ చేస్తున్నారా? పోస్ట్‌పోన్ చేస్తున్నారా? స్పష్టత ఇవ్వండి.. లేదంటే ఓ లేడీ ఫ్యాన్.. ‘మరోసారి సూసైడ్ లెటర్ రాస్తుంది.. అసలే ఆమె ప్రెగ్నెంట్’” అంటూ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన రాధాకృష్ణ.. “ఇట్స్ టైమ్ ఫర్ లవ్ లెటర్స్, నాట్ సూసైడ్ లెటర్స్ (ఇది ప్రేమలేఖల సమయం..సూసైడ్ లేఖలది కాదు)” అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో అనుకున్న తేదీకే ‘రాధేశ్యామ్’ రానుందని మరోసారి స్పష్టమైంది.