అమెరికాలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు కరోనా సోకింది. “లక్షణాలు కనిపించగా పరీక్షలు చేయించుకున్నాను. అందులో కొవిడ్ సోకినట్లు తేలింది. నాకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వైద్యుల సలహాను పాటిస్తున్నాను” అని ఆస్టిన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆస్టిన్ కోరారు. రెండు డోసుల కొవిడ్ టీకా డోసుతో పాటు బూస్టర్ డోసు తీసుకున్నప్పటికీ ఆస్టిన్ కరోనా బారినపడడం గమనార్హం.
Flash- అమెరికా రక్షణ మంత్రికి కరోనా పాజిటివ్
Corona positive for US Secretary of Defense