మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. మెగాస్టార్ కెరీర్‌లో 153వ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆచార్య నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం చిరు అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి, చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. అలాగే చిరుకి జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ సినిమా నుండి చానా కష్టం అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు.