రౌడీ హీరో విజయ్‌తో రష్మిక డేటింగ్‌? సాక్ష్యం ఇదిగో..!

Rashmi dating rowdy hero Vijay? Here is the proof ..!

0
113

గీత గోవిందం సినిమాతో సూపర్ క్యూట్ జంటగా మారారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. అయితే ఈ సినిమాలో రష్మిక-విజయ్‌ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అదే సమయంలో రష్మిక సైతం తన ప్రియుడు, కన్నడ నటుడు రోహిత్‌ శెట్టితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.

కాగా కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై విజయ్‌ కానీ, ఇటు రష్మిక కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ అప్పడప్పుడు వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టడం, ముంబైలో పలుమార్లు డిన్నర్‌ డేట్స్‌కు వెళుతూ కెమెరాలకు చిక్కారు. అంతేకాకుండా న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం ఇద్దరు కలిసి గోవా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా లీకైన ఓ ఫోటో ఆ వార్తలకు నిజమేనని రుజువు చేసింది.

న్యూ ఇయర్‌ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్‌ 2022 మై లవ్స్‌ అంటూ రష్మిక తన సోషల్‌ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్‌ చేసింది. అయితే కాసేపటికే విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ సైతం న్యూ ఇయర్‌ విషెస్‌ చెబుతూ ఓ ఫోటోను షేర్‌ చేశాడు. ఇందులో విజయ్‌ కూడా పక్కనే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రష్మిక, ఆనంద్‌ షేర్‌ చేసిన ఫోటోల్లో ఒకటే బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది. దీంతో లొకేషన్‌ ఎక్కడో చూసినట్లుందే అంటూ నెటిజన్లు తమదైన స్టైల్‌లో కామెంట్లు చేస్తున్నారు. దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక న్యూ ఇయర్‌ సెలబ్రేట్‌ చేసుకుంటుంది.. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారనడానికి ఇదే సాక్ష్యం అంటూ నెటిజన్లు ఈఫోటోలను తెగ వైరల్‌ చేస్తున్నారు.