తెలంగాణ సర్కార్ చేపట్టిన ఉద్యోగులు, టీచర్ల బదిలీలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జివో 317 ఉద్యోగుల్లో తీవ్ర అయోమయాన్ని,ఆందోళనకు గురి చేస్తోంది. దీనితో వారికి మద్దతుగా ఎంపీ బండి సంజయ్ ఆదివారం రాత్రి కరీంనగర్లో జాగరణ దీక్ష చేపట్టారు. దీనితో పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న బీజేపీ అధిష్టానం నడ్డాను హైదరాబాద్ కు పంపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ సర్కార్ పై, సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాదు భ్రష్టా చార్ జనతా పార్టీ అధ్యక్షుడు. నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ లో బీజేపీ ఒక లోక్ సభ సీటు తో పాటు మూడు అసెంబ్లీ సీట్లను ఉప ఎన్నికల్లో కోల్పోయింది. నడ్డా ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. సొంత రాష్ట్రంలో బీజేపీ ఓడిపోవడంతో నడ్డా మతి స్థిమితం కోల్పోయాడు. నడ్డా అబద్ధాల బిడ్డ గా మారి మిషన్ భగీరథలో నీళ్లు రాలేవంటున్నారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఉంటుందా
మీ ఎమ్మెల్యేల ఎంపీల నియోజవర్గాల్లో ఎక్కడికైనా వెళ్దాం మిషన్ భగీరథ నీళ్లు రాలేదంటే దేనికైనా సిద్ధం. నీతి ఆయోగ్ నివేదికలు చదివితే తెలంగాణ, కేసీఆర్ గొప్పతనాలు తెలుస్తాయి.
నడ్డా బీజేపీ సెల్లర్స్, కిల్లర్స్ పార్టీగా మారింది. మిషన్ భగీరథ నీళ్ళతోనే నడ్డాకు స్నానం చేపిస్తాం. బండి సంజయ్ కు అదే స్క్రిప్ట్ అమిత్ షా నడ్డా లకు ఒకే స్క్రిప్ట్ రాసి బీజేపీ నేతలు అభాసు పాలయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎలాంటి అవినీతి జరగలేదని రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమే పార్లమెంటు లో సమాధానమిచ్చింది. బీజేపీ దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతుంది. కాళేశ్వరంపై అడ్డదిడ్డంగా మాట్లాడిన నడ్డాను అర్జెంటుగా ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చాలి. బీజేపీ ఏ టు జడ్ స్కాం ల పార్టీ ఇంగ్లీషులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నీ కుంభ కోణాలు చేసిన పార్టీ బీజేపీ నడ్డా చేసిన ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి. అనుచితమైన భాష మాట్లాడుతున్న ఎంపీ అరవింద్ తదితర నేతల పై పోలీసులు తక్షణమే పీడీ యాక్ట్ నమోదు చేయాలి.
బండి సంజయ్ పేపర్లు చదవరు. నడ్డా కూడా సంజయ్ కన్నా అద్వాన్నంగా అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. నడ్డా నక్రాలు ఆపు. తెలంగాణలో నిన్ను నమ్మెందుకు బక్రాలు ఎవ్వరూ లేరు
కేసీఆర్ కుటుంబం ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఇంతమంది కుటుంబ సభ్యులు ఎందుకు పాల్గొంటున్నారు అని ఎవరైనా ఆడిగారా బీజేపీ లో పదవుల్లో ఉన్న కుటుంబసభ్యుల చిట్టా చాలా పెద్దగా ఉంది. నడ్డా నిజాలు దాచి మాట్లాడుతున్నారు. తెలంగాణలో అవినీతి జరిగితే నీతి ఆయోగ్ ఎందుకు అన్ని రంగాల్లో ప్రశంసలు కురిపిస్తోంది. అరవింద్ తప్పుడు కూతలు మానుకో. ఇక ఆట మొదలైంది. బండి సంజయ్ ఓ క్రిమినల్ .స్వాతంత్ర సమరయోధుడా…అరెస్టు చేస్తే కొవ్వొత్తుల ర్యాలీ ఎందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ తో బీజేపీ నేతల దుర్భషలు ఎక్కువ అవుతున్నాయి.
పోలీసులు ఇక కఠినంగా వ్యవహరించాలి. నడ్డా ఇది తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని గ్రహించాలి. బీజేపీ ఆఫీస్ లో తాగేది మిషన్ భగీరథ నీళ్లే. సంజయ్ జైల్లో తాగేది కూడా మిషన్ భగీరథ నీళ్లేబీజేపీ నేతలకు బెంగాల్లో పట్టిన గతే తెలంగాణలో పడుతుంది. రేవంత్ కు మెంటలెక్కి బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తున్నారు. అన్ని ఉపఎన్నికల్లో బీజేపీ తో కుమ్మక్కయిన పార్టీ కాంగ్రెస్
సంజయ్ అరెస్టుతో తెలంగాణ ప్రశాంతంగా ఉంది. ఢిల్లీలో తెలంగాణను కేంద్రం మెచ్చుకుంటుంది. గల్లీలో బీజేపీ నేతలు తిడుతున్నారు. రూల్ ఆఫ్ లా ప్రకారం పోలీసులు నడుచుకుంటున్నారు.
సంజయ్ పై ఎన్నో కేసులు ఉన్నాయి. ఆయన నేర చరిత్రను బట్టే పోలీసులు వ్యవహరించారు.
ఉరికించే దగ్గర ఉరికిస్తాం. ఊరుకునేదగ్గర ఊరుకుంటాం. డిపాజిట్లు కోల్పోయే పార్టీ బీజేపీ ఏ యుద్ధం చేస్తుంది. బీజేపీ ఆట మొదలైంది. క్లోజ్ కూడా అయ్యింది.
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎవరో కాంగ్రెస్, బీజేపీలే తేల్చుకోవాలి. బీజేపీ నేతలు తాలిబన్లలా మారారు. కాంగ్రెస్ బీజేపీలకు భవిష్యత్ లో ఇపుడున్న సీట్లు కూడా రావు కేసీఆర్ తెలంగాణ గాంధీ.. ఆయన వ్యక్తి కాదు శక్తి. కేసీఆర్ ను బీజేపీ ముట్టుకుంటే షాక్ తప్పదు. గాడ్సే లను మెచ్చుకుంటున్న వారు గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లడం సిగ్గు చేటు. బీజేపీకి దేశ వ్యాప్తంగా గడ్డు రోజులు మొదలయ్యాయని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.