Flash- అమితాబ్‌ ఇంట్లో మళ్లీ కరోనా టెన్షన్‌..ఐసోలేషన్‌లో బిగ్‌బీ

Coronation tension again in Amitabh's house..Bigg in isolation

0
111

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఇంట్లో మరోసారి కరోనా కలకలం రేగింది. ముంబయిలోని అమితాబ్‌ ఇంట్లో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకింది.  మిగతా వారికి నెగెటివ్‌ వచ్చింది. అయితే వారు కూడా క్వారంటైన్‌లో ఉంటున్నారు. కరోనా సోకిన వ్యక్తికి కూడా ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ముందు జాగ్రత్తగా బిగ్‌ బీ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు.

కాగా గతేడాది అమితాబ్ కూడా కొవిడ్‌ 19 బారిన పడ్డారు. జూలైలో కరోనాతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దాదాపు 23 రోజులు చికిత్స తీసుకున్నారు. ఒక వారం తర్వాత అభిషేక్‌, ఐశ్వర్య రాయ్‌, ఆరాధ్య సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరొసారి బిగ్‌బీ ఇంట్లో కరోనా టెన్షన్‌ పెడుతోంది.