సింహాన్ని దూరం నుంచి చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది ఓ మహిళ భయం లేకుండా తల్లి బిడ్డను ఎత్తికెళ్లినట్లు సింహాన్ని మోసుకెళ్లింది. కువైట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.
సాధారణంగా ఎక్కడైనా కుక్కలు, పిల్లుల వంటి జంతువులను పెంచుకుంటారు. అయితే కువైట్లో సింహం, పులులు వంటి భయంకరమైన వన్యప్రాణులను పెంచుకుంటారు. అయితే ఇది అక్కడ చట్టరీత్యా నేరం. అయినప్పటికీ తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని వదులుకోలేక ప్రభుత్వానికి తెలియకుండా వాటిని కొందరు పెంచుకుంటున్నారు.
చట్టాలు చేసినంత మాత్రాన తమ సంప్రదాయాన్ని వదులుకోలేమని చెబుతున్నారు. అయితే దీనిని జంతుప్రేమికులు విమర్శిస్తున్నారు. ఇలా చేయడం తగదని..వన్యప్రాణులను అడవిలోనే వదిలిపెట్టాలని సూచిస్తున్నారు.
వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.
https://twitter.com/ramseyboltin?