బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా అఖండ. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పటికే వీరిద్దరి ఖాతాలో సింహా, లెజెండ్ వంటి హిట్స్ రాగా అఖండ అంతకుమించి విజయం సాధించింది.
థియేటర్లలో కలెక్షన్ల సునామీ కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
అఖండ తెలుగు సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందంటూ బాలయ్య అభిమాని ఒకరు ట్వీట్ చేయగా.. అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిప్లై ఇస్తూ అసలు విషయం చెప్పింది. 21 జనవరి, 2022న అఖండ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి అంటూ ట్వీట్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు ఖుషి అవుతున్నారు.
https://twitter.com/vijayendr9999?