పంజాబ్ లో నిన్న ప్రధాని మోడీ కాన్వాయ్ ను అడ్డుకున్న సంఘటన దేశమంతా కలకలం రేపింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ పై ఆగిపోయింది. ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది.
అయితే ఈ సంఘటనపై హీరో సిద్దార్థ్ ట్విట్టర్ వేదిక గా సెటైర్లు పేల్చారు. పంజాబ్ జరిగిన ఆ ఘటన సమయంలో.. అక్కడ నిలిచిపోయింది నిజంగా ప్రధాని కాన్వాయా…అసలు అందులో ప్రధాని ఉన్నాడా అని ప్రశ్నించారు. ప్రధాని కాన్వాయ్ లో ఉన్నది నటులు కావచ్చు. ఇలాంటి నటన బీజేపీ పార్టీ నేతలు ఎన్నో సార్లు చేశారు… ఇది కూడా పెద్ద నాటకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో సిద్ధార్థ్. దీనిపై విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.