‘ఫైట ర్’గా దేవర కొండ

‘ఫైట ర్’గా దేవర కొండ

0
103
Vijay Deverakonda

ఇస్మార్ట శంకర్ సూపర్ సక్సస్‌తో యమ ఖుషిగా ఉన్న డైరక్టర్ పూరి జగన్నాథ్, తన తర్వాతి సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో నివుగ్నవుయ్యాడు. ఆ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించనున్న విషం తెలిసిందే.

కాగా తాజా సమాచారం ప్రకారం ఆ మూవీ కి ఫైటర్ అనే టైటిల్ ఖరారు చేశారు. పూరి కనెక్ట్స్ బేనర్‌పై ఆ టైటిల్‌ను ఫిల్మ చాంబర్లో ఇప్పటికి రిజిస్టర్ చేశారు. ఆ టైటిల్ విజయ్ దేవరకొండతో చేసే సినిమా కోసమే అని పూరి సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. ఆ టైటిల్‌ని బట్టి విజయ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో అతడ్ని పూరి ఎలా చూపించబోతున్నాడో అర్థవువుతోంది.

కాగా క్యారెక్టర్‌కు తగ్గట్టు విజయ్ తన బాడీని మార్చుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడు క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షుటింగ్ పూర్తయిన వెంటనే వర్కౌట్స్, డైట్ ఫాలో చేసి, శరీరాన్ని దృఢంగా మార్చుకోనున్నాడు. ఇప్పుడైతె విజయ్ సన్నగా కనిపిస్తున్నాడు. ఫైటర్ రోల్‌కు కండలు తిరిగి శరీరం కావాలి కాబట్టి దానికోసం డిసెంబర్ వరకు టైం తీసుకోనున్నట్లు సమాచారం. విజయ్ సరసన హీరోయిన్ కోసం పూరి, నిర్మాత ఛార్మి అన్వేషిస్తున్నారు. విజయ్‌తో కొత్త కాంబినేషన్‌ను చూపించాలని వాళ్లనుకుంటున్నారు.