ఏపీలో పార్టీ ఏర్పాటుపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చని, అదే విషయం తాను చెప్పానన్నారు. తాను పుట్టింది.. తన బతుకు తెలంగాణతోనే ముడిపడి ఉందన్నారు. YSRను ప్రేమించిన తెలంగాణ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకే YSRTP పుట్టిందని స్పష్టం చేశారు షర్మిల.
అలాగే తెలంగాణ ప్రజల కోసమే ఇక్కడ పార్టీ పెట్టానని, రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని జోస్యం చెప్పారు. నిరంతరం అధికారంలో ఉంటాం అనుకోవడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. అధికారంలో లేని వారు.. అధికారంలోకి రారనుకోకూడదన్నారు. పాలిటిక్స్ లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చని..ఎవరికీ అధికారం శాశ్వతం కాదన్నారు.