సినిమా టికెట్ల దుమారం..పేర్ని నానితో రాంగోపాల్ వర్మ భేటీ

0
66

సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈనెల 10న భేటీ కానున్నారు.  టికెట్ల వ్యవహారంపై ఇటీవల ట్విట్టర్​లో మంత్రి పేర్ని నాని, రాంగోపాల్ వర్మల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆర్జీవీ చేసిన విజ్ఞప్తికి.. మంత్రి పేర్ని నాని కూడా ట్వీట్టర్​ వేదికగా స్పందించారు. “ఆర్జీవీకి ధన్యవాదాలు.. తప్పకుండా త్వరలో కలుద్దాం” అంటూ.. రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని ఈనెల 10న అపాయింట్​మెంట్ ఇచ్చారు.

సినిమా టికెట్ల అంశంపై ఏపీ మంత్రులు వర్సెస్ ఆర్జీవీ అన్నట్లుగా గత కొంత కాలంగా ట్వీట్ వార్ నడిచింది. ఇటీవల మంత్రి పేర్ని నానిని కలిసేందుకు ఆర్జీవీ అనుమతి కోరారు. మంత్రి అనుమతిస్తే తమ సమస్యలు వివరిస్తానని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్​ చేశారు.