సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అతని అంత్యక్రియలు మధ్యాహ్నం ఒంటిగంటకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.
ఏఐజీ ఆస్పత్రిలో ఉన్న రమేశ్ భౌతికకాయాన్ని.. కుటుంబసభ్యుల సందర్శనార్థం మరికాసేపట్లో పద్మాలయ స్టూడియోకు తరలించనున్నట్టు తెలుస్తుంది. కాగా, అంత్యక్రియల సమయంలో అభిమానులు గుమికూడకుండా ఉండాలని కోరింది ఘట్టమనేని కుటుంబం. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.
‘అల్లూరి సీతారామరాజు’ (1974) చిత్రం ద్వారా వెండితెర ప్రవేశం చేశారు రమేశ్‌బాబు. కృష్ణ, మహేశ్‌బాబుతో కలిసి పలు సినిమాల్లో నటించారు. సుమారు 15 చిత్రాల్లో ఆయన కీలకపాత్రలో పోషించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేశ్‌బాబు 2004లో నిర్మాతగా మారారు. ‘అర్జున్’, ‘అతిథి’ సినిమాలు నిర్మించారు.