శోక‌సంద్రంలో టాలీవుడ్..అన్న చివరి చూపుకు హీరో మహేష్ బాబు దూరం!..కంట తడిపెట్టిస్తున్న వైనం

Mahesh is far from the last look of Tollywood in mourning

0
103

సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అతని అంత్యక్రియలు మధ్యాహ్నం ఒంటిగంటకు జూబ్లీహిల్స్​ మహాప్రస్థానంలో జరగనున్నాయి.

అయితే ర‌మేష్ బాబు మృతితో టాలీవుడ్ శోక‌సంద్రంలో మునిగిపోయింది. ప‌ద్మాల‌య స్టూడియోస్ కి ర‌మేష్ బాబు భౌతిక‌కాయాన్ని త‌ర‌లించారు. పద్మాలయ స్టూడియోకు ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, సీని ప్రముఖులు చేరుకుంటున్నారు.  రమేష్‌ బాబు భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

విగతజీవిగా పడి వున్న కొడుకు రమేష్ బాబుని చూసి చలించిపోయారు సూపర్ స్టార్ కృష్ణ. క‌న్నీళ్ల‌తో త‌న కొడుకు ర‌మేష్ బాబుకి నివాళుల‌ర్పించారు. అయితే రమేష్ తమ్ముడు సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన నేపథ్యంలో అన్న అంత్యక్రియలకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.