హీరోగా మారనున్న సింగర్ సిద్​ శ్రీరామ్..​ఆ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం?

Star Singer Sid Shriram Who Will Become A Hero .. Who Directed That Star Director?

0
87

యువ గాయకుడు సిద్‌ శ్రీరామ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ఆయన పాడిన ప్రతి పాట ఓ సెన్సేషనే. సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ దక్కించుకుంటూ..ఆయా చిత్రాలకు కావాల్సినంత ప్రచారం కల్పిస్తున్నాయి.

ఇప్పుడు సిద్​ శ్రీరామ్ కొత్త అవతారమెత్తబోతున్నట్లు తెలుస్తుంది.​ మణిరత్నం రూపొందించనున్న సినిమాలో శ్రీరామ్ హీరోగా నటించనున్నట్టు తెలుస్తుంది. అయితే అంతకుముందు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘కడలి’ సినిమాతో సిద్‌ శ్రీరామ్‌ గాయకుడిగా తెరకు పరిచయం అవ్వడం విశేషం.

ఇప్పుడాయన చిత్రంతోనే సిద్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కోలీవుడ్‌ నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడం వల్ల హీరోగా నటించేందుకు అంగీకరించినట్లు ప్రచారం వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.