తెలంగాణలో విషాద ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి రాజాపేట మండలం బూర్గుపల్లిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. బూర్గుపల్లి సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఉరేసుకొన్నారు. వారి మృతితో ఇరువురి కుటుంబాల్లో కొండంత విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.