కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సారథిగా డి.కె.శివకుమార్

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సారథిగా డి.కె.శివకుమార్

0
113

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సారథిగా ప్రముఖ నేత, ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన డి.కె. శివకుమార్ నియమించేందుకు అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. 14 నెలల పాటు సాగిన సంకీర్ణ ప్రభుత్వంలో కీలకులుగా డి.కె. శివకుమార్ వ్యవహరించారు.

మరికాన్ని రోజుల్లోనే 17 నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు పొంచి ఉండడంతో పాటు రాష్ట్రమంతటా పార్టీని బలోపేత చేసే సమర్థనాయకుడు అవసరమని భావించిన అధిష్టానం డి.కె. శివకుమార్ ను ఎంపిక చేసేందుకు సిద్దమైనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుత అధ్యక్షులు దినేష్ గుండూరావ్ సారథ్యంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. 28 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం ఒక స్థానం మాత్రమే దక్కింది. అప్పటినుంచే పార్టీ అధ్యక్షుడి మార్పు అనివార్యమనే ప్రచారం సాగుతోంది. దినేష్ గుండు రావ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ వేణు గోపాల్, మాజీ ‘సీఎం సిద్ధారామాయలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని చెడ్డపేరు ఉంది. దింతో భవిష్యత్ లో పార్టీకి మనుగడ ఉండాలంటే కీలకమైన నేత అవసరమని డి.కె. శివకుమార్ పేరు తెరపైకి తెచ్చినట్లు సమాచారం