బంగార్రాజు ట్రైలర్ వచ్చేసింది..!

0
87

సోగ్గాడే చిన్ని నాయన’కు ప్రీక్వెల్​గా తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. నాగార్జున-నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ, చైతూకు జోడీగా కృతిశెట్టి నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. తొలి పార్ట్​కు దర్శకత్వం వహించిన కల్యాణ్​కృష్ణ దీనిని తెరకెక్కించారు.

అన్నపూర్ణ స్టూడియోస్​ బ్యానర్​లో నాగార్జునే స్వయంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14న ప్రేక్షకుల  ముందుకు తీసుకురానున్నారు.. దీనితో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది.

ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకోగా..తాజాగా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. నాగార్జున, చైతన్య అదరగొట్టారు. మ్యూజిక్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

https://youtu.be/AF4j7c2z_sM