రెండోసారి కరోనా బారిన పడ్డ కేంద్ర మంత్రి

Union Minister affected by corona for the second time

0
174

దేశవ్యాప్తంగా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు వరుసగా కొవిడ్ బారినపడుతున్నారు. రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్, బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఇటీవలే కొవిడ్ నిర్ధరణ అయిన ప్రముఖుల్లో ఉన్నారు. తాజాగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

“ఈరోజు (మంగళవారం) చేసిన పరీక్షల్లో నాకు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. స్వల్ప లక్షణాలున్నాయి. తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాను. ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉన్నాను. నన్ను ఇటీవలే కలిసినవారు.. ఐసోలేషన్​కు వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా.” అని గడ్కరీ ట్వీట్ చేశారు. గతేడాది సెప్టెంబర్​లోనూ ఆయన కొవిడ్ బారినపడ్డారు.