మెగాస్టార్​తో సినిమాకు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరోయిన్​

0
72

స్టార్​ హీరోయిన్​ అనుష్క మళ్లీ తన జోరు పెంచేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ఈ మద్యే  పొలిశెట్టితో ఓ మూవీ చేసేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.  మరో చిత్రానికి ఓకే చెప్పేందుకు రెడీ అయినట్లు తెలిసింది.మెగాస్టార్​ చిరంజీవి ఇటీవలే వెంకీ కుడుములతో ఓ చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు.

ఇందులో హీరోయిన్​గా అనుష్క పేరును చిత్రబృందం వెలువరించింది. ఇప్పటికే ఆమెను సంప్రదించి కథను కూడా వివరించారని తెలిసింది. కథ నచ్చి అనుష్క కూడా ఓకే చెప్పేందుకు సిద్ధమైందట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

ఇది కనుక నిజమైతే ఫ్యాన్స్​కు పండగే.అంతకుముందు చిరు-అనుష్క కలిసి ‘స్టాలిన్’​ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో కలిసి చిందులేశారు. చిరు ప్రస్తుతం భోళా శంకర్, బాబీతో ఓ సినిమా చేస్తున్నాడు.