దేశవ్యాప్తంగా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు వరుసగా కొవిడ్ బారినపడుతున్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఇటీవలే కొవిడ్ నిర్ధరణ అయిన ప్రముఖుల్లో ఉన్నారు. తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కరోనా బారినపడ్డారు. తాజాగా జరిపించిన కరోనా పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.
టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సైతం కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కన్పించగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.