Review: బంగార్రాజు మూవీ రివ్యూ

0
82

‘కింగ్‌’లా కనిపించాలన్నా, ‘మన్మథుడి’లా మగువ మనస్సు దోచేయలన్నా,  ఆయన తరువాతే ఎవరైనా.. 2016లో వచ్చిన ‘సోగ్గాడే.. చిన్ని నాయనా’తో సంక్రాంతి బరిలో దిగిన అక్కినేని నాగార్జున.. ఈసారి తనయుడు నాగచైతన్యతో ఆ చిత్రానికి సీక్వెల్‌ ‘బంగార్రాజు’తో శుక్రవారం (జనవరి 14న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెల్లటి పంచెకట్టుతో నాగార్జున, ఫ్లోరల్‌ డిజైన్‌ షర్ట్స్ తో నాగ చైతన్య అక్కినేని అభిమానులకే కాదు, అందరిలోనూ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. ఇంతకీ బంగార్రాజు  మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

భూమ్మీదకు వచ్చిన పనులన్నీ పూర్తి చేసుకుని మళ్లీ స్వర్గానికి వెళ్తాడు బంగార్రాజు (నాగార్జున). అక్కడ రంభ, మేనక, ఊర్వశిలతో కబడ్డీలు ఆడుకుంటూ ఆయనకు నచ్చినట్టు ఉంటాడు. ఆ సమయంలో అనుకోకుండా భార్య సత్యభామ (రమ్యకృష్ణ) అతని దగ్గరకు వెళ్తుంది. భూమ్మీద చిన బంగార్రాజు (నాగచైతన్య) ఎలా ఉన్నాడన్నది ఆమెకు దిగులు. అక్కడి నుంచే దంపతులు చినబంగార్రాజు చేష్టలను చూస్తుంటారు. ఎలాగైనా అతనికి, నాగలక్ష్మి (కృతిశెట్టి) తో పెళ్లి చేయాలని అనుకుంటారు. ఓ శివకార్యం కోసం… సరిగ్గా అదే సమయంలో పెద బంగార్రాజును భూమ్మీదకు పంపాలని అనుకుంటారు ఇంద్రుడు, యముడు. స్వామి కార్యం, సొంతకార్యం చేసుకోవడానికి భూమ్మీదకు వచ్చిన బంగార్రాజు ఏం చేశాడు? తన మనవడి పెళ్లి ఫిక్స్ చేయగలిగాడా? చిన బంగార్రాజుకు పిల్లనిచ్చి పెళ్లి చేసే రమేష్‌ అసలు స్వభావం ఏంటి? అతనికి ఆదితో ఉన్న బంధం ఏంటి? వంటి విషయాలన్నీ ఆసక్తికరం.

అమాయకపు రాము కేరక్టర్ లో నాగార్జున యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా ఇమిడిపోయారు. రమ్యకృష్ణను పుటుకీ అంటూ ఆటపట్టించే బంగార్రాజు కేరక్టర్‌ అయితే కింగ్‌కి కొట్టిన పిండి అన్నట్టే ఉంది. గత సినిమాలతో పోలిస్తే చైతన్యలో ఈజ్‌ బాగా కనిపించింది. నాగార్జున ఎనర్జీని, ఆయన మేనరిజాన్ని మ్యాచ్‌ చేస్తూ చాలా సన్నివేశాల్లో శభాష్‌ అనిపించుకున్నారు చైతన్య. నాగలక్ష్మి కేరక్టర్‌లో కృతిశెట్టి చక్కగా చేశారు. పల్లెటూరి అమ్మాయి, దానికి తోడు లీడర్‌ అనిపించుకోవాలనుకునే అమ్మాయిగా మెప్పించారు. వెన్నెలకిశోర్‌, బ్రహ్మాజీ కేరక్టర్లు ఉన్నంతలో మెప్పించాయి. రావు రమేష్‌ కేరక్టర్‌ని ఎవరూ ఊహించరు. ఆది కేరక్టర్‌ చేసిన తనికి మంచి ఫ్యూచర్‌ ఉంటుంది. సంపత్‌ కేరక్టర్‌ సినిమాలో సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌.

ప్లస్ పాయింట్స్: లడ్డుండ పాట, నాగార్జున, చైతన్య,క్లైమాక్స్ లో వచ్చే డైలాగులు,  ఫరియా అబ్దుల్లా చేసిన స్పెషల్‌సాంగ్

మైనస్ పాయింట్స్: చిన్న చిన్న లాజిక్కులు, ఆల్రెడీ తెలిసిన సబ్జెక్టే కావడం

రేటింగ్: 3/5