దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్ మొదలైందనే భయం కలుగుతుంది.
తాజాగా ఏపీలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 39,816 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 4,528 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనాతో నిన్న ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి కొత్తగా 418 కోలుకోగా, ప్రస్తుతం 18,318 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.
కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 327
చిత్తూరు 1027
ఈస్ట్ గోదావరి 327
గుంటూరు 377
వైస్సార్ కడప 236
కృష్ణ 166
కర్నూల్ 164
నెల్లూరు 229
ప్రకాశం 142
శ్రీకాకుళం 385
విశాఖపట్నం 992
విజయవాడ 121
వెస్ట్ గోదావరి 62