మీకు సంతానం కలగడం లేదా?..అయితే ఈ రసం తాగి చూడండి!

0
75

ఈ మ‌ధ్య కాలంలో సంతాన స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న దంప‌తులు ఎంద‌రో ఉన్నారు.పెళ్లై ఎన్ని ఏళ్లు గ‌డుస్తున్నా. పిల్ల‌లు క‌ల‌గ‌కుంటే బాధ‌, భ‌యం, తెలియ‌ని ఆందోళ‌న‌, ఎదుట వారి సూటిపోటి మాట‌లతో నానా ఇబ్బందులు ప‌డ‌తారు. అయితే సంతాన స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌డానికి కేవ‌లం ఆడ‌వారే కార‌ణం అనుకోవ‌డం పొర‌పాటు. మ‌గ‌వారిలో ఉండే లోపాలు కూడా పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి కార‌ణం కావొచ్చు.అందుకే దంపతులిద్ద‌రూ స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

సంతాన సమస్యలను ఎదుర్కొంటున్న పురుషులు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే వీరికి మున్ముందు మధుమేహం వంటి జీవక్రియల జబ్బులు ముంచుకొచ్చే ప్రమాదముంది. స్వీడన్‌ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీర్యంలో వీర్యకణాల సంఖ్య తక్కువగా గలవారిని ఎంచుకొని, ఇతరులతో పోల్చి చూడగా కొన్ని కొత్త సంగతులు బయటపడ్డాయి. సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల లోపు వారిలో మూడింటి ఒక వంతు మందిలో టెస్టోస్టిరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల స్థాయిలు ఏడు రెట్లు తక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. వీరిలో ఎముక సాంద్రత కూడా తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గినవారిలో ఇది ప్రముఖంగా కనబడుతోంది. దీని మూలంగా ఎముక క్షీణించటం, తేలికగా విరగటం వంటివి తలెత్తుతాయి.

శృంగారంపై ఆసక్తి పెరగటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బాదంపప్పు దగ్గర్నుంచి మునక్కాడల వరకు రకరకాల పదార్థాలు తింటుంటారు. అయితే ఇవి ఎంతవరకు పనిచేస్తాయనేది మాత్రం తెలియదు. వీటి ప్రభావాలు శాస్త్రీయంగానూ రుజువు కాలేదు. కానీ ఈ విషయంలో మెంతులు కొత్త ఆశలను చిగురింప జేస్తున్నాయి. మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతున్నట్టు తేలటమే దీనికి కారణం. కొందరికి ఆరు వారాల పాటు మెంతుల సారాన్ని ఇచ్చి పరిశీలించగా.. 82% మందిలో శృంగారాసక్తి గణనీయంగా పెరిగినట్టు తేలింది. అంతేకాదు.. 63% మందిలో శృంగార సామర్థ్యమూ మెరుగుపడటం గమనార్హం. మెంతుల్లో సాపోనిన్స్‌ అనే వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇది టెస్టోస్టీరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగటానికి దోహదం చేస్తుండొచ్చన్నది పరిశోధకుల భావన.