అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఉన్న నిషేధాన్ని మరోమారు పొడిగించింది డీజీసీఏ. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో పాటు కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తుండడమే ఇందుకు కారణమని పేర్కొంది. జనవరి 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించొద్దని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. అయితే తాజాగా దీనిని వచ్చే ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.