టాలీవుడ్ లో మరో విషాదం..ప్రముఖ నటుడు మృతి

0
104

టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడి మరణించారు. తాజాగా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ నటుడు కొంచాడ శ్రీనివాస్‌ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సుమారు 40 కి పైగా సినిమాలు, 10 కి పైగా సీరియల్స్‌ లో నటించారు కొంచాడ శ్రీనివాస్‌. శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌, ప్రేమకావాలి, లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు.