యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో‘ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 30 న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సుమారు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో హై ఆక్టేన్ సన్నివేశాలతో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుందట. ప్రభాస్, శ్రద్ధాకపూర్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయట. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది. రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా అన్ని రికార్డులపై కన్నేసింది.
సోషల్ మీడియా సంస్థల్లో ఒకటయిన ట్విట్టర్ ‘సాహో‘ కి ప్రత్యేకంగా ఎమోజీని కూడా తయారు చేసింది. ఇప్పటి వరకు ది లయన్ కింగ్, అవెంజర్స్ లాంటి సినిమాలకి ప్రత్యేక ఎమోజీలని ఇచ్చిన ట్విట్టర్ ఒక తెలుగు సినిమాకి ఎమోజీని ఇవ్వడం ఇదే మొదటిసారి. సాహో డిజిటల్ రైట్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడవడం చూసి షాకయ్యారు. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియో సాహో తెలుగు, తమిళ, మళయాళ హక్కుల్ని 42 కోట్లకి కొనుక్కుంది.
హిందీ కాకుండానే ఇంత రేట్ కి అమ్ముడయ్యిందంటే హిందీ తో కలిపితే ఇది ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే సాహో సినిమా అమెజాన్ లోకి ఎప్పుడు వస్తుందనే ప్రశ్న మొదలైంది. సాధారణంగా ఏ సినిమా అయినా విడుదలయిన ఐదు వారాల తర్వాత డిజిటల్ లోకి వస్తుంది. కానీ సాహో మాత్రం ఎనిమిది వారాల తర్వాత అమెజాన్ లోకి వస్తుందట. అంటే విడుదలయిన 56 రోజుల తర్వాత అమెజాన్ లో ఈ సినిమాని చూడవచ్చు.