చినజీయర్ స్వామిని అరెస్ట్ చేయాలి..కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ డిమాండ్

0
100

చినజీయర్ స్వామిని తక్షణమే అరెస్ట్ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్ )రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్ వెస్లీ, టి స్కైలాబ్ బాబు లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పంది మాంసం తింటే పంది ఆలోచనలు, మేక మాంసం తింటే మేక ఆలోచనలు, కోడి మాంసం తింటే కోడి లాగా పెంటకుప్పల్లో ఏరుకతింటారని మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్మాద పూరిత వ్యాఖ్యలు చినజీయర్ స్వామి చేయడం తగదు. ప్రజస్వామ్యం రాజ్యాంగం ఏ మాత్రం గౌరవం లేకుండా మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీశారని విమర్శించారు. దేశంలో మెజార్టీ ప్రజలు మాంసహారులని ఇప్పటికే పోషకాహార లోపంతో దేశం ఆకలిచావులు అంగవైకల్యంతో జన్మిస్తుంటే పేదలకు మాంసహారానికి కూడా దూరం చేయాలనే కుట్ర దాగి ఉందన్నారు.

మతోన్మాద భావాలతో నూటికి 90 శాతం మందిని కించపర్చడం అన్యాయమని చెప్పారు. దళితులు గిరిజనులు పంది మాంసం తింటారని వారిని కించపర్చినందువల్ల చినజీయర్ పై ఎస్సి, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. చినజీయర్ ఏమైనా మనిషి మాంసం తింటాడా అని ప్రశ్నించారు. ఆహార అలవాట్ల పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయలకతీతంగా ప్రతీ ఒక్కరు ఖండించాలన్నారు. ట్రస్ట్ ముసుగులో ఆస్తులు పోగు చేసుకుంటూ దేశంలో రాందేవ్ బాబా ను మించిపోయాడని చెప్పారు. చినజీయర్ మొత్తం బలహీన వర్గాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేనట్లయితే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

టి స్కైలాబ్ బాబు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కేవీపీఎస్ తెలంగాణ